Tuesday, December 18, 2012

ప్రియా!
కడుపులోబొడ్డు కింద చెలరేగే భయంకర నరాల ఒత్తిడికి..
గోడ కట్టిన గుండెల్లో, ఎక్కడో లోతుల్లో
మాట విన్నా కూడా నన్ను పట్టించుకొక ఎగిసిపడే ఎక్కిళ్ల ప్రతిధ్వనికి..
ఎంత పాతికేళ్లుగా నాతో పాటే సంచరించి నాకొక నీడనిచ్చిన
శరీరమైనా కూడా,దాన్నుంచి కొంతసేపైనా పలాయించటానికి..
అనవసరమైనా,అకారణమైనా,అకాలమైనా అనివార్యమైన అశాంతికి...
వీటన్నిటినుంచి
తాత్కాలికమైనా, నీ వల్లే నాకు విముక్తి.
నువ్వంటే సమరంకి ఏ విలువా వుండకపోవచ్చు
రామకృష్ణకి కోటి రక్తపు బిందువుల అంతశ్శక్తి
నీ ఒక్క బొట్టు కావొచ్చు
చవకబారు హాస్యానికి ,ఎకిలి నవ్వులకి
మొదటగా బలిపీఠం ఎక్కేది నువ్వే కావొచ్చు
నీకు నువ్వు సృస్టి పరమ పదార్ధానివి అయ్యుండొచ్చు
కాని,
నాకు మాత్రం
కాలంతో కళ్లు గోడ్రాలిగా మారిపోతే
సృష్టి ఒత్తిడి భరించలేక
రూపం మారిన నా కన్నీటి చుక్కవి నువ్వు...
నన్ను చీల్చుకుని బయటకి చిమ్మావా!
క్షణ కాలం గొప్ప శాంతి
మరో అరక్షణం లొకం నుంచి చక్కని విశ్రాంతి.
చాలా కాలంగా రూపమివ్వటానికి నన్ను వేధిస్తున్న, అలొచనల సంకెళ్లతో బందీ ఐన
అనుభవానికి స్వేచ్ఛా ప్రసాదం
(హమ్మయ్యా ఆర్గాస్మ్ అయ్యిపొయింది
ఇప్పుడు ఒళ్లు సుళువుగా వుంది)...అన్న మిత్రుడి రాతను చూసి ఒక రూపం
వచ్చినట్టు..

గుండ్ర(వ్

కట్టపడి కట్టపడి
కలలుగని కలలుగని
కట్టుకున్న వూరు శివర్న ఇల్లు,
నాటకాల లైటింగతనుఅలాగెళ్లి ఇలాగెళ్లి
ఇందాకటి కాడికి తిరిగి రాబోడికి...
వూరు సెంటర్కొచ్చి కుచ్చొంది.

ఇంకిలా కాదెహే అని,
భూమి అంచుకి భవబంధాలు వదిలి బయల్దేరబోతుంటే,
ఒరేయ్ తింగరెదవ కాన..
భూమి గుమ్మిడికాయంత గుండ్ర(వ్ రా  అని...
ముందే చెప్పేసింది...
మాయదారి శేత్రం!!!