Tuesday, December 18, 2012

ప్రియా!
కడుపులోబొడ్డు కింద చెలరేగే భయంకర నరాల ఒత్తిడికి..
గోడ కట్టిన గుండెల్లో, ఎక్కడో లోతుల్లో
మాట విన్నా కూడా నన్ను పట్టించుకొక ఎగిసిపడే ఎక్కిళ్ల ప్రతిధ్వనికి..
ఎంత పాతికేళ్లుగా నాతో పాటే సంచరించి నాకొక నీడనిచ్చిన
శరీరమైనా కూడా,దాన్నుంచి కొంతసేపైనా పలాయించటానికి..
అనవసరమైనా,అకారణమైనా,అకాలమైనా అనివార్యమైన అశాంతికి...
వీటన్నిటినుంచి
తాత్కాలికమైనా, నీ వల్లే నాకు విముక్తి.
నువ్వంటే సమరంకి ఏ విలువా వుండకపోవచ్చు
రామకృష్ణకి కోటి రక్తపు బిందువుల అంతశ్శక్తి
నీ ఒక్క బొట్టు కావొచ్చు
చవకబారు హాస్యానికి ,ఎకిలి నవ్వులకి
మొదటగా బలిపీఠం ఎక్కేది నువ్వే కావొచ్చు
నీకు నువ్వు సృస్టి పరమ పదార్ధానివి అయ్యుండొచ్చు
కాని,
నాకు మాత్రం
కాలంతో కళ్లు గోడ్రాలిగా మారిపోతే
సృష్టి ఒత్తిడి భరించలేక
రూపం మారిన నా కన్నీటి చుక్కవి నువ్వు...
నన్ను చీల్చుకుని బయటకి చిమ్మావా!
క్షణ కాలం గొప్ప శాంతి
మరో అరక్షణం లొకం నుంచి చక్కని విశ్రాంతి.
చాలా కాలంగా రూపమివ్వటానికి నన్ను వేధిస్తున్న, అలొచనల సంకెళ్లతో బందీ ఐన
అనుభవానికి స్వేచ్ఛా ప్రసాదం
(హమ్మయ్యా ఆర్గాస్మ్ అయ్యిపొయింది
ఇప్పుడు ఒళ్లు సుళువుగా వుంది)...అన్న మిత్రుడి రాతను చూసి ఒక రూపం
వచ్చినట్టు..

గుండ్ర(వ్

కట్టపడి కట్టపడి
కలలుగని కలలుగని
కట్టుకున్న వూరు శివర్న ఇల్లు,
నాటకాల లైటింగతనుఅలాగెళ్లి ఇలాగెళ్లి
ఇందాకటి కాడికి తిరిగి రాబోడికి...
వూరు సెంటర్కొచ్చి కుచ్చొంది.

ఇంకిలా కాదెహే అని,
భూమి అంచుకి భవబంధాలు వదిలి బయల్దేరబోతుంటే,
ఒరేయ్ తింగరెదవ కాన..
భూమి గుమ్మిడికాయంత గుండ్ర(వ్ రా  అని...
ముందే చెప్పేసింది...
మాయదారి శేత్రం!!!

Monday, October 8, 2012

(అ)నిత్యం

బూతు కథల పుస్తకం కోసం అలమరా వెతుకుతుంటే…….

తెల్లని కాగితాల మీద మూడున్నరేళ్ళ  క్రితం రేగిన

అలజడికి ముద్ర గుర్తులు.



రాతలు,రాతలు,రాతలు…………

పేజీలు,పేజీలు,పేజీలు…………

బుజ్జి,బుజ్జి,బుజ్జి…………

మద్య మద్యలో కన్నీటి చుక్కలకి

అటూ ఈటూ చెరిగిపోయిన   ఇంకు గుర్తులు

నాల్గు లైన్లు చదివి ఇంక continue చెయ్యాలంటే భయం......

 వల్ల కావట్లేదు

ఎమన్నా అర్ధం వుందా వీటికి!!!!!

Pure emotions……

తీవ్రమైన అలోచనకి అలవాటు పడిపోయిన  మెదడుకి

simple,straight,uncomplicated,unadulterated emotions

అంటే  చచ్చేంత భయం అనుకుంటా!!

మనసు ఒకవైపు నుంచి సొణగడం మొదలెట్టింది

ఏమిటా రాతలు….

 పిచ్చి రాతలు….

పిల్ల రాతలు….

ఆ పిల్లేమననుకునుంటుందో….

ఎంతైనా చాలా అదృష్టవంతురాలు….ఎంత అదృష్టం తనకి!!!!

వాచి ఉబ్బిపోయిన అహానికి నువ్వే ఒకప్పుడు అప్పుడు అంటే,

 నేనూ వెన్నలాంటి వాడినే అని లోపలెక్కడో ఆనందం……

అంతలోనే....

ఎవరన్నా చూస్తే,

అమ్మో! ఎవరన్నా చూస్తే..

ఛీ,ఛీ

ఇంత చైల్డిష్....నవ్వరూ/////

ఏదో గుర్తొస్తుంది…



….

….

సముద్రం ఒడ్డున పసి పిల్లలు గులకరాళ్లతో ఇల్లు కట్టుకుంటున్నారు…

సముద్రం,సముద్రం,సముద్రం….

నువ్వే, నువ్వే,నువ్వే

నువ్వంటే నువ్వే….అంటే నేనే!!

..

..

..

ఆ కన్నీళ్లు,గుండెలదిరిపోయేలా వినిపించే లబ్ డబ్ లు

పిచ్చి  రాతలెలా ఐపోయాయో,

మళ్లీ కొన్నాళ్లకి

ఇవికూడా అంతేనేమో,ఏమోలే.

ఎమైనా ఏమో కి thanks .

Monday, August 13, 2012

అప్పుడప్పుడూ ఎప్పుడో ఒక్కొక్కసారి గుర్తొస్తుంటావ్ నువ్వు
గుర్తొచినప్పుడల్లా నా అంతర్ముఖత్వాన్ని భరించలేక
బహిర్ముఖిని కాలేక
ఆనందం,దుఃఖం కలగలిసి పోయే  ఆ దిగంత రేఖపై
 బాధాబాధతప్త హృదయంతో  ఏవో మూల్గుతూ ఊంటాను
కానీ చిత్రం,
 అంతగా కదిలించే  నువ్వు ఎప్పుడోగాని గుర్తుకురావ్ !
ఈ ప్రపంచపు నక్క కూతల రొద మాత్రం  అంటిపెట్టుకునే వుంటుంది ప్రతిక్షణం !!

Sunday, May 27, 2012

నానీల్లాంటి అప్పాలు

బస్సు రొద తో
గిత్తల గిట్టల చప్పుడు ఢీక్కొని చచ్చిపొయింది.....

నల్లని తారుతో
కమ్మటి మట్టి వాసన సజీవ ఖననం ......

సిమెంటొచ్చింది
ఇంటి వాకిల్ని నిర్జీవ స్మశానంగా మార్చింది....

మనుషుల సెల్ ఫోన్లు
చిలకల శవపేటికలు......

టి.వి మొదలయ్యింది
మాటా మంతీ మొద్దు నిద్ర పొయ్యింది....

ఎన్నో  నీలి చిత్రాల కృత్రిమత్వం
కొన్ని ధారా వాహికల కంపు కంటె గొప్ప
నయం.....