అప్పుడప్పుడూ ఎప్పుడో ఒక్కొక్కసారి గుర్తొస్తుంటావ్ నువ్వు
గుర్తొచినప్పుడల్లా నా అంతర్ముఖత్వాన్ని భరించలేక
బహిర్ముఖిని కాలేక
ఆనందం,దుఃఖం కలగలిసి పోయే ఆ దిగంత రేఖపై
బాధాబాధతప్త హృదయంతో ఏవో మూల్గుతూ ఊంటాను
కానీ చిత్రం,
అంతగా కదిలించే నువ్వు ఎప్పుడోగాని గుర్తుకురావ్ !
ఈ ప్రపంచపు నక్క కూతల రొద మాత్రం అంటిపెట్టుకునే వుంటుంది ప్రతిక్షణం !!

No comments:
Post a Comment